భద్రాచల పట్టణ కూనవరం రోడ్ లోని శ్రీ సరస్వతి శిశు ఆవాస విద్య మందిరంలోనూతనంగా నిర్మించిన కంప్యూటర్ ల్యాబ్, పాఠశాల వెబ్ సైట్ ను భద్రాచలం ఎస్పీ రమేష్ చంద్ర శనివారం ప్రారంభించారు.
స్వయం ఇన్ఫోలాజిక్ ప్రైవేట్ లిమిటెడ్ – హైదరాబాద్ మరియు ఇన్సెప్టియో – ఇంగ్లాండ్ సంస్థల CEO శ్రీ భాగవతుల చైతన్య కుమార్ సహకారంతో ఈ ల్యాబ్ ని పాఠశాల విద్యార్థులకు ఏర్పాటు చేసారు. అనంతరం రమేష్ చంద్ర మాట్లాడుతూ రానున్న రోజుల్లో కంప్యూటర్ ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పాఠశాల కార్యదర్శి శ్రీ గట్టు వెంకటాచారి,రాజేంద్ర ప్రసాద్, ఏం భాస్కర రావు, రామాయణం శర్మ, పాఠశాల ప్రిన్సిపాల్ గీత, త్రివేణి సౌమ్య పాఠశాల అధ్యాపకులు ,ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు